రజనీపై శ్రీరెడ్డి సీరియస్ కామెంట్
వివాదాస్పదన నటి శ్రీరెడ్ది కాస్టింగ్ కౌచ్ ఆరోపణలతో టాలీవుడ్, కోలీవుడ్ ని షేక్ చేసిన సంగతి తెలిసిందే. కొన్నాళ్లు సలైంట్ గా ఉన్న శ్రీరెడ్డి.. ఇటీవల మళ్లీ ఎటాక్ ని మొదలెట్టింది శ్రీరెడ్డి. మాస్ దర్శకుడు బోయపాటి, నటి ఎమ్మెల్యే రోజాపై సంచలన కామెంట్స్ చేసింది. తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ పై సీరియస్ కామెంట్స్ చేసింది.
రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేశారు. దీనిపై అధికారిక ప్రకటన చేసేశారు. ఇంకా తన పార్టీ జెండా, అజెండాలని ప్రకటించాల్సి ఉంది. మరోవైపు, రజనీ వరుస సినిమాలతో బిజీ అవుతున్నారు. ఇటీవలే మురగదాస్ దర్శకత్వంలో దర్భార్ సినిమాని పూర్తి చేసిన రజనీ.. శివ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో రజనీకి పొలిటిక్స్ పై సీరియస్ నెస్ లేదని విమర్శలు వినిపిస్తున్నాయ్.
ఈ నేపథ్యంలో శ్రీరెడ్డి రజనీని సీరియస్ గా ప్రశ్నించింది. ‘రజినీకాంత్ గారు.. ఇదేమీ సినిమా కాదు సస్పెన్స్ మైంటైన్ చేయడానికి.. మీరు రాజకీయాల్లోకి వస్తారా..? రారా..? క్లారిటీ ఇవ్వండి’ అంటూ పోస్ట్ పెట్టింది. అంతేకాదు.. రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తే.. ఆయన పార్టీలో తను కూడా జాయిన్ అవుతానని మరో పోస్ట్ పెట్టింది. మరీ.. శ్రీరెడ్ది ప్రశ్నకి రజనీ సమాధానం ఇస్తారా ? అన్నది చూడాలి.