‘రొమాంటిక్’ సెట్స్ లో అగ్ని ప్రమాదం


దర్శకుడు పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి తాజా చిత్రం ‘రొమాంటిక్’. పూరి శిష్యుడు అనిల్ పాడూరి దర్శకత్వం వహిస్తున్నారు. పూరికి జంటగా కేతికశర్మ నటిస్తున్నారు. సోమవారం ఈ సినిమా సెట్స్ లో అగ్నిప్రమాదం జరిగింది. కర్టన్స్ కి మంటలు అంటుకొని.. ప్రమాదం పెద్దదిగా అయ్యేలా కనిపించింది. ఐతే, ఇంత చిత్రబృందం అలర్టయి మంటలని ఆర్పేయడంతో పెను ప్రమాదం తప్పింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇక మెహబూబా తర్వాత ఆకాష్ పూరి నటిస్తున్న చిత్రమిది.

పూరి కథని అందించారు. ఆయన శిష్యుడు అనిల్ పాడూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ బోల్డ్ గా వుంది. ఇడియట్ తరహా రొమాంటిక్ ఎంటర్ టైనర్ అని చెబుతున్నారు. ఇక ఇస్మార్ట్ శంకర్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన పూరి తన తదుపరి సినిమాని విజయ్ దేవరకొండతో చేసేందుకు రెడీ అవుతున్నారు.