ఆర్టీసీ సమ్మెపై కేకే ఆందోళన


ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో రాష్ట్రంలో పరిస్థితులు చేయి దాటిపోతున్నాయని తెరాస ముఖ్యనేత కె. కేశవరావు ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో ఆయన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. తెలంగాణ ఆర్టీసీ ఐకాస నేతలతో సంప్రదింపుల విషయమై సీఎం కేసీఆర్ నన్ను ఇప్పటి వరకు పిలవలేదన్నారు. ఆర్టీసీ ఐకాస నేతలెవ్వరూ తనను కలవలేదని, ఒక వేళ సీఎం ఆదేశిస్తే మధ్యవర్తిగా ఉంటానని కేకే తెలిపారు.

రాష్ట్రంలో పరిస్థితులు చేయి దాటుతున్నాయనే ఉద్దేశంతోనే స్పందించా. ఇద్దరు కార్మికులు చనిపోయారనే బాధతోనే చర్చలకు సిద్ధం కావాలి అంటూస్టేట్మెంట్ ఇచ్చాను. ఆర్టీసీ సమ్మెపై కేవలం ఒక సీనియర్ నాయకుడిగా మాత్రమే స్పందించానని, కార్మికుల సమస్యలు గురించి పునరలోచించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు కేకే వెల్లడించారు. కేకే తాజా స్పందనతో ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్ ఏ రేంజ్ లో ఉన్నది అన్నది అర్థమవుతోంది. మరీ.. ఇప్పటికైనా కార్మికులతో చర్చలు జరిపేందుకు సీఎం కేసీఆర్ సిద్ధమవుతారా ? అన్నది చూడాలి.