‘ప్రతిరోజూ పండగే’ టీజర్ టాక్


‘చిత్రలహరి’ హిట్ తో హ్యాపీ మూడులోకి వచ్చేశాడు మెగాయంగ్ హీరో సాయి తేజ్. ఆ మూడుకి తగ్గట్టుగానే ‘ప్రతిరోజు పండగే’ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి మారుతి దర్శకుడు. రాశీఖన్నా కథానాయిక. యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ 2 సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
సాయి తేజ్ పుట్టినరోజు కానుకగా ఈ సినిమా టీజర్ ని విడుదల చేశారు. టీజర్ అంటే టీజర్ కాదు. టీజర్ లాంటిది. ఇందులో తాత కళ్లలో ఆనందం చూసే మనవడిగా తేజ్ కనిపించారు.

తాత మనవడు అనుబంధాలతో పాటు, తండ్రి కొడుకు, పెద్ద సంఖ్యలో కుటుంబసభ్యులు ఇతరత్రా వ్యవహారం కళ్లకు కట్టినట్లు కనిపించేలా చూపించేశారు. మారుతి చేస్తున్న కంఫ్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఇది. ఈ సినిమా హిట్టయితే.. మారుతి మీద పడిన బూతు ముద్ర మొత్తం చెరిగిపోయినట్టే.ఇక టీజర్ లో బర్త్ డే బోయ్ సాయి తేజ్ అందంగా కనిపిస్తున్నాడు. మొహంలో ఎక్స్ ప్రెషన్స్ తో ఆకట్టుకొన్నాడు. పుట్టినరోజు పండగ టీజర్ ని మీరు చూసేయండీ..!