ఏపీ కేబినెట్‌ భేటీ హైలైట్స్

ఏపీ ప్రభుత్వం చేనేత కుటుంబాలకి గుడ్ న్యూస్ చెప్పింది. చేనేత కుటుంబాలకు ‘వైఎస్సార్‌ చేనేత నేస్తం’ పేరుతో  ఏటా డిసెంబర్‌ 21న రూ. 24వేల ఆర్థిక సాయాన్ని అందించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఇవాళ జరిగిన ఏపీ కేబినేట్ లో సమావేశంలో నిర్ణయం తీసుకొన్నారు.  వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు రూ.10వేలు ఇవ్వాలని కేబినెట్‌ నిర్ణయించింది. తాజాగా ఏపీ కేబినేట్ తీసుకొన్న నిర్ణయాలని మంత్రి షేర్ని నాని మీడియాకు వివరించారు.

ఏపీ కేబినేట్ తీసుకొన్న నిర్ణయాలు :

* చేనేత కార్మికుల కుటుంబాలకు ‘వైఎస్‌ఆర్‌ నేతన్న నేస్తం’ కింద ఏడాదికి రూ.24వేల ఆర్థికసాయం ఇవ్వాలని నిర్ణయం. ఏటా డిసెంబర్‌ 21న అందజేత. దీంతో 90వేల కుటుంబాలకు లబ్ధి. ఈ పథకం కింద రూ.216కోట్లు ఖర్చు అవుతుందని అంచనా.

* హోంగార్డుల జీతాల పెంపునకు కేబినెట్‌ ఆమోదం. రోజుకు ఇచ్చే రూ.600 అలవెన్స్‌ను రూ.710కి పెంచుతూ నిర్ణయం.

* మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో ఇచ్చే ఆర్థిక సాయం రూ.10వేలకు పెంపు. మెకనైజ్డ్‌ బోట్లు ఉన్నవారికే కాకుండా తెప్పలపై వేట సాగించే వారికి కూడా తొలిసారిగా ఈ పథకం వర్తింపు. అంతర్జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా నవంబర్‌ 21న ఈ పథకం ప్రారంభం.

* మత్స్యకారులకు డీజిల్‌పై లీటర్‌కు రూ.9 సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయం. డీజిల్‌ కొనుగోలు చేసే సమయంలోనే సబ్సిడీ వర్తింపు. దీనికోసం నిర్దేశిత బంకుల ఏర్పాటు. నవంబర్‌ 21 నుంచి అమలు. సుమారు రూ.100కోట్లు ఖర్చు అవుతుందని అంచనా.

* అందరికీ సురక్షితమైన మంచినీరు అందించేందుకు వాటర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు

* శ్రీకాకుళం జిల్లా పలాసలో రూ.50కోట్లతో నిర్మించనున్న 200 పడకల కిడ్నీ ఆస్పత్రి, రీసెర్చ్‌ సెంటర్‌లో 5 రెగ్యులర్‌, 100 కాంట్రాక్ట్‌, 60 ఔట్‌సోర్సింగ్‌ పోస్టుల నియామకానికి అనుమతి

* మధ్యాహ్న భోజన పథకం కార్మికుల వేతనం రూ.1000 నుంచి రూ.3వేలకు పెంపు

* బార్‌ అసోసియేషన్‌లో సభ్యులుగా ఉన్న మూడేళ్లలోపు జూనియర్‌ న్యాయవాదులకు నెలకు రూ.5వేలు ఇచ్చేందుకు కేబినెట్‌ ఆమోదం. డిసెంబర్‌ 3న జాతీయ న్యాయవాదుల దినోత్సవం సందర్భంగా ప్రారంభించాలని నిర్ణయం.

* రైతులకు ఉచిత బోర్లు వేసేందుకు 200 డ్రిల్లింగ్‌ యంత్రాల కొనుగోలుకు నిర్ణయం.

* ఏపీఎస్‌ ఆర్టీసీలో కాలం చెల్లిన సుమారు 3500 బస్సులను తొలగించి కొత్త బస్సుల కొనుగోలుకు కేబినెట్‌ ఆమోదం. దీనికోసం రూ.వెయ్యికోట్ల రుణానికి ఆర్టీసీకి అనుమతి.