అయోధ్య కేసు : విచారణ పూర్తి.. ఇక తీర్పు మిగిలింది !

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌గొగొయి నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం గత 40 రోజులుగా అయోధ్య కేసుని రోజువారీ విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. ఈరోజుతో విచారణ ముగిసింది. తీర్పును సుప్రీం రిజర్వులో ఉంచింది. విచారణ సందర్భంగా ఈరోజు ఉదయం ఇద్దరు న్యాయవాదుల మధ్య వాగ్వాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ఈకేసుకు సంబంధించి ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటే మూడు రోజుల్లోపు రాతపూర్వకంగా అందజేయాలని సుప్రీంకోర్టు ఇరువర్గాలకు గడువు విధించింది.

ఈ నేపథ్యంలో మూడు రోజుల తర్వాత ఏ క్షణమైన అయోధ్య కేసుకు సంబంధించిన తుది తీర్పు రానుంది. నవంబర్ 17లోపు అంటే.. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌గొగొయి పదవి విరమణ ఆఖరి రోజు లోపు అయోధ్య కేసులో తుది తీర్పు రానుంది. ఈ కేసులో సుప్రీం ఏ తీర్పునిస్తుంది. ఆ తర్వాత చోటు చేసుకోనున్న పరిణామాలు ఎలా ఉండబోతున్నాయనేది ఉత్కంఠగా మారింది. ఒకేవేళ ఈ కేసులో హిందులకి అనుకూలంగా సుప్రీం తీర్పు వచ్చినట్టయితే.. అతి త్వరలోనే అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి మోడీ ప్రభుత్వం శ్రీకారం చుట్టే ఛాన్స్ ఉందని చెప్పవచ్చు.