వెంకీమామకు మంచి డేటు
బాబీ దర్శకత్వంలో వెంకీ ఆయన మేనల్లుడు నాగ చైతన్య కలిసి నటిస్తున్న చిత్రం ‘వెంకీమామ’. సురేష్ బాబు-పీపుల్స్ మీడియా కలిసి నిర్మించిన ఈ మల్టీస్టారర్ సంక్రాంతికి ముందా ? వెనకా ? సందిగ్ధంలో ఉంది. ఈ నేపథ్యంలో ఇటీవల టాలీవుడ్ లో ఏర్పడిన యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ నుంచి సురేష్ బాబుకు ఓ బంపర్ ఆఫర్ వచ్చింది. అదేటంటే ? వెంకీమామ సినిమాను డిసెంబర్ 20కి కాస్త అటు ఇటుగా వేసుకోవాలి. ఆ టైమ్ కు మరే సినిమా రాకుండా సోలో విడుదల దక్కేలా చేసే బాధ్యత గిల్డ్ తీసుకుంటుంది.
డిసెంబర్ లో రావడానికి రెడీ అవుతున్న ప్రతి రోజు పండగే, 96, డిస్కోరాజా, భీష్మ సినిమాలు వాయిదా వేస్తారు. మొత్తం దారి ఖాళీగా వుంచుతారు. అయితే బాలయ్య-కేఎస్ రవికుమార్ సినిమా విషయం మాత్రం గిల్డ్ బాధ్యత తీసుకోదు. ఈ సినిమా సంక్రాంతి సినిమాగా ముస్తాబువుతోంది. ఒకవేళ ఇంకా ముందే వచ్చినా.. గిల్డ్ ఏం చేయలేని పరిస్థితి. సరైన డేట్ దొరక్కుండా కిందా మీదా అవుతున్న వెంకీ మామకు డిసెంబర్ 20 మంచి డేటు అని చెప్పవచ్చు. ఐతే, ఈ ఆఫర్ ను సురేష్ బాబు ఓకే చేయాల్సి ఉంది. వెంకీమామకు లైన్ క్లియర్ అయితే డిసెంబర్ సినిమాల విషయంలో ఓ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పవచ్చు.