జమ్మూకశ్మీర్ లో భీకర్ ఎదురు కాల్పులు


జమ్మూకశ్మీర్ లోని అనంత్ నాగ్ జిల్లా శివారులోని బిజ్ బెహరా ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఉగ్రవాదులు ఓ ఇంట్లోకి చొరబడి కాల్పులు జరుపుతున్నారు. ప్రస్తుతం భద్రతా దళాలు ఆ ఇంటిని చుట్టుముట్టాయి. ముగ్గురు ముష్కరులు నక్కి ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇరు వర్గాల మధ్య భీకర కాల్పులు కొనసాగుతున్న నేపథ్యంలో స్థానికులను అక్కడి నుంచి ఖాళీ చేయించారు.

ముందస్తు చర్యల్లో భాగంగా మొబైల్, ఇంటర్ నెట్ సేవల్ని తాత్కాలికంగా నిలిపివేశారు. భద్రతా బలగాలు ఉగ్రదాడిని తిప్పికొడుతున్నారు. భద్రతా బలగాల కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమైనట్లు సమాచారం. గాందర్బల్ అడవుల్లో తలదాచుకుంటున్న ఇద్దరు ఉగ్రవాదుల్ని మంగళవారం పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.