ఆర్టీసీ కార్మికులతో చర్చల కోసం ప్రభుత్వం కొత్త కమిటీ
హైకోర్టు ఆదేశాలతో ఆర్టీసీ సమ్మెపై కేసీఆర్ సర్కార్ దిగిరాక తప్పలేదు. కార్మికులతో తిరిగి చర్చలు జరిపేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం ప్రభుత్వం అధికారులు, మంత్రులతో కమిటీ వేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈరోజే కమిటీని ప్రకటించి.. చర్చలు మొదలెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మరోవైపు ఆర్టీసీ నేతలు కూడా చర్చలకు సిద్ధమని ప్రకటించారు. అయితే సమ్మె విరమించి చర్చలకు వెళ్లే ప్రసక్తే లేదని.. ముందు చర్చలు జరగాలని జేఏసీ నేతలు తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో 12వ రోజు సమ్మె కొనసాగుతోంది. ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు ఇవాళ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు చేపట్టనున్నారు. ఇక ఆర్టీసీ కార్మికులకు టీఎన్జీవో సంఘం పూర్తి మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే.