ఎన్టీఆర్, ఏఎన్నార్ తర్వాత స్గానం చిరుదే !


ఎన్టీఆర్, ఏఎన్నార్ తర్వాత స్థానం మెగాస్టార్ చిరంజీవిదే అన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ఢిల్లీ పర్యటనలో ఉన్న చిరంజీవి వెంకయ్యని ఆయన నివాసంలో కలిశారు. వెంకయ్య కోసం సైరా చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించారు. సినిమా చూసిన అనంతరం వెంకయ్య నాయుడు చిరంజీవిని అభినందించారు.

“నేను చాలా రోజుల క్రితమే చెప్పా ఎన్టీఆర్, ఏఎన్నార్ తర్వాత తెలుగులో ఉన్న గొప్ప నటుడు చిరంజీవినే. వారిద్దరూ ఇప్పుడు లేరు. ఇప్పుడు చిరు  సినిమాలు చేస్తుండడం సంతోషాన్నిచ్చే విషయం. ఊరూవాడ చూడదగిన ఉత్తమ చిత్రం సైరా నరసింహాసరెడ్డి. చాలా కాలం తర్వాత చక్కటి ప్రేరణ కలిగించే చిత్రాన్ని చూశా. నటీనటులకు, సాంకేతిక నిపుణులకు నా అభినందనలు” అన్నారు వెంకయ్య. ఇక చిరు కేంద్రమంత్రి అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోడీలతోనూ చిరు సమావేశం కానున్నారు. వారిని సైరా సినిమా చూడమని కోరనున్నారు.