వీవీఎస్ కు ప్రమోషన్ ?

బీసీసీఐలో దాదాగిరి మొదలుకాబోతున్న సంగతి తెలిసిందే. బీసీసీఐ అధ్యక్ష స్థానానికి ‘సౌరవ్‌ గంగూలీ ’ ఒక్కడే నామినేషన్‌ వేయడంతో ఈ నెల 23న జరిగే బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశంలో గంగూలీ ఎన్నిక లాంఛనమే కానుంది. ఈ నేపథ్యంలో ఆయనకి శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. గంగూలీకి బ్యాటింగ్‌ లెజెండ్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ శుభాకాంక్షలు తెలిపాడు. గంగూలీ సారథ్యంలో ఇకపై భారత క్రికెట్‌ ముందడుగు వేస్తుందని వీవీఎస్‌ ట్వీట్‌ చేశాడు.  

“త్వరలో నూతన అధ్యక్షుడిగా ఎన్నిక కాబోతున్న సౌరవ్‌ గూంగూలీకి అభినందనలు. నీ సమర్థ సారథ్యంలో భారత క్రికెట్‌ సుసంపన్నమవుతుంది. ఇందులో నాకెలాంటి సందేహం లేదు. నాడు భారత కెపె్టన్‌గా విజయవంతమైనట్లే ఇప్పుడీ పాత్రలోనూ దాదా విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నా” అని లక్ష్మణ్‌ ట్వీట్‌ చేశాడు. దీనిపై గంగూలీ స్పందిస్తూ ‘థ్యాంక్యూ వీవీఎస్‌. నా ప్రయాణంలో నీ సేవలు, అమూల్యమైన సూచనలు నాకు అవసరం’ అని రిప్లై ఇచ్చారు. ఈ నేపథ్యంలో వీవీఎస్ కు ప్రమోషన్ రాబోతుంది అనే కామెంట్స్ వినిపిస్తున్నాయ్. అదే సమయంలో గంగూలీ ఫస్ట్ టార్గెట్ కోచ్ రవిశాస్త్రీ అనే ప్రచారం జరుగుతోంది. మరీ.. దాదా ఏం చేస్తారో చూడాలి.