రమ్యకృష్ణ ‘రొమాంటిక్’లో కనిపిస్తారా ?

పూరి తనయుడు ఆకాష్ పూరి తాజా చిత్రం ‘రొమాంటిక్’. కేతిక శర్మ కథానాయిక. పూరి శిష్యుడు అనిల్ పాడూరి దర్శకత్వం వహిస్తున్నారు. కథ-మాటలు పూరి అంచారు. పూరి సొంత బ్యానర్ లోనే తెరకెక్కుతోంది. ఇప్పుడీ సినిమా గురించి ఆసక్తికర విషయం బయటికొచ్చింది. ఇందులో సీనియర్ నటి రమ్యకృష్ణ కీలక పాత్రలో కనిపించనుందట.

‘శైలజా రెడ్డి అల్లుడు’ సినిమాలోని పాత్ర తరహాలో ఆమె ‘రొమాంటిక్’లో పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారని అంటున్నారు. సినిమా అంతా రమ్యకృష్ణ కనిపిస్తారనీ, ఆమె పాత్రను పూరి గొప్పగా డిజైన్ చేశాడని సమాచారమ్. ఐతే, ఇన్నాళ్లు రొమాంటిక్ లో రమ్యకృష్ణ ఉన్నారనే విషయం బయటికి రాలేదు. రమ్యకృష్ణ ఉందని తెలియడంతో రొమాంటిక్ రేంజ్ మరింతగా పెరిగిందని చెప్పవచ్చు.