పండగ చేసుకొనే అందాలు

మెగా యంగ్ హీరో సాయి తేజ్ పుట్టినరోజున పండగ టీజర్ వచ్చేసింది. మారుతి దర్శకత్వంలో ఆయన నటిస్తున్న చిత్రం ‘ప్రతిరోజు పండగే’. రాశీఖన్నా కథానాయిక, యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ 2 సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సంక్రాంతి వస్తుందనుకొన్న పండగ అంతకంటే ముందే అంటే డిసెంబర్ లోనే వచ్చే ఛాన్స్ ఉంది. 

ఇక సాయి తేజు పుట్టినరోజు కానుకగా మంగళవారం వచ్చిన ప్రతిరోజు పండగే టీజర్ నిజంగానే పండగలా ఉంది. తాత కళ్లలో ఆనందం చూసే మనవడిగా తేజ్ కనిపించారు. ఫ్యామిలీ మొత్తం దిగిపోయింది. ఎమోషన్స్ ని టచ్ చేయలేదు కాను. బంధాలు, భాందవ్యాలు.. సంతోషాలతో టీజర్ ని నింపేశారు. ఈ ఫ్యామిలీ టీజర్ లో ఓ రొమాంటిక్ బిట్ సీన్ అదిరిపోయింది. రాశీఖన్నా బ్యాక్ అందాలని చూపించేశారు. ఆ ఒంపు సొంపులు సూపర్ అంటున్నారు.

రామ్ ‘ఉన్నది ఒక్కటే జిందగీ’ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ బ్యాక్ అందాలు చూపించిన రేంజ్ లో రాశీ ఖన్నా సొంపుసొంపులు ఉన్నాయి. కెరీర్ మొదట్లో గ్లామర్ పాత్రలకే పరితమైన రాశీ.. తొలిప్రేమ సినిమాతో మంచి నటి అనిపించుకొంది. ప్రస్తుతం రాశీ ప్రతిరోజు పండగ సినిమాతో పాటు డిస్కో రాజా సినిమాలోనూ నటిస్తోంది.