సాయి తేజ్ గొప్ప మనసు


సాయి తేజ్ ఎవరు అనుకొంటున్నారా ? మన మెగా యంగ్  హీరో సాయిధరమ్ తేజ్. ‘చిత్రలహరి’ సినిమా నుంచి సాయి తేజ్ గా పేరు మార్చుకొన్న సంగతి తెలిసిందే. ఆయన తాజా చిత్రం ‘ప్రతిరోజు పండగే’. మారుతి దర్శకుడు. యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ 2 సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మంగళవారం సాయి తేజ్ పుట్టినరోజు కానుకగా ప్రతిరోజు పండగే టీజర్ లాంటిది ఒకటి రిలీజ్ చేశారు. అంతేకాదు.. పుట్టినరోజున తేజు గొప్ప నిర్ణయం తీసుకొన్నాడు.

మ‌ధ్య‌లో ఆగిపోయిన ఓ ఓల్డేజ్ హోమ్ నిర్మాణం పూర్త‌య్యేవ‌ర‌కు తాను పూర్తి బాధ్య‌త వ‌హిస్తాన‌ని మాటిచ్చాడు. అంతేకాదు సంవ‌త్స‌రం పాటు ఓల్డేజ్ హోమ్ ర‌న్ అవ‌డానికి కావ‌ల‌సిన మొత్తాన్ని తాను స‌మ‌కూరుస్తానని తేజ్ చెప్పుకొచ్చాడు. ఈ కార్య‌క్ర‌మంలో పాలు పంచుకున్న మెగా ఫ్యాన్స్ అంద‌రికి ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌తలు తెలియ‌జేశాడు. ఇదేదో గొప్ప‌లు చెప్పుకోవ‌డానికి ప‌బ్లిక్ డొమైన్‌లో మాట్లాడ‌డం లేదు. నన్ను చూసి చిన్న పిల్లాడు లేదా పెద్ద వాళ్లు ఎవ‌రో ఒక‌రు ఇన్‌స్పైర్ అయినా చాల‌నే చిన్న కార‌ణంతో ఈ వీడియో పోస్ట్ చేస్తున్నానని తేజు స్ప‌ష్టం చేశాడు. తేజ్ నిర్ణయంపై నెటిజన్స్ ని ప్రశంసలు దక్కుతున్నాయ్. రియల్ హీరో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.