‘టెర్మినేటర్ : డార్క్ ఫేట్’ ట్రైలర్ (తెలుగు) వచ్చేసింది ! 

టాలీవుడ్ సంచలనం విజయ్ దేవరకొండ హాలీవుడ్ సినిమాలని ప్రమోట్ చేసే రేంజ్ కి ఎదిగాడు. హాలీవుడ్‌ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన సైన్స్‌ ఫిక్షన్‌ మూవీ.. ‘టెర్మినేటర్‌’. ఈ  సిరీస్‌లో వచ్చే సినిమాలకు వరల్డ్ వైడ్‌ చాలా క్రేజ్ ఉంది. ఈ సిరీస్‌లో ఆరవ సినిమాగా ‘టెర్మినేటర్: డార్క్ ఫేట్’ తెరకెక్కింది. ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగ్గర్ మరోసారి టెర్మినేటర్‌గా అలరించనుండగా, ‘డెడ్‌పూల్’ ఫేమ్ టిమ్ మిల్లర్ డైరెక్ట్ చేస్తున్నాడు.

ప్రముఖ దర్శక నిర్మాత జేమ్స్ కెమరూన్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇంగ్లీష్ ట్రైలర్ ఇప్పటికే  రిలీజ్ అయ్యి యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ తో దూసుకుపోతోంది. ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడ,తమిళ భాషల్లోనూ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్ ని విజయ్ దేవరకొండ చేతులమీదుగా రిలీజ్ చేశారు.

‘నా పేరు సారా కానర్‌. ఆగస్టు 29, 1997.. అది జడ్జిమెంట్‌ డే. కానీ, నేను నా భవిష్యత్తును మార్చుకున్నాను. మూడు బిలియన్‌ (300 కోట్ల మంది) జీవితాల్ని కాపాడాను..’ అంటూ.. లిండా హామిల్టన్ గతాన్ని గుర్తు చేసుకోవడంతో స్టార్ట్ అయిన ట్రైలర్ ఇంట్రస్టింగ్‌గా ఉంది. యాక్షన్ అదిరిపోయింది. ఈ సినిమా నవంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.