బిగ్ బాస్ హౌస్’లో లవ్ సీన్.. హైలైట్ ! 


హౌస్ లో అన్ని రకాల ఎమోషన్స్ పండేలా బిగ్ బాస్ ప్లాన్ చేస్తాడు. సీజన్ 3లో ప్రస్తుతం ఫ్యామిలీ ఎమోషన్స్ బలంగా పండుతున్నాయి. మంగళవారం ఎపిసోడ్ నుండి బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్స్ రిలేటివ్స్ ని పంపిస్తున్నారు. మంగళవారం ఎపిసోడ్ లో వితికా చెల్లెలు రాగా, బుధవారం ఎపిసోడ్ లో అలీ రెజా భార్య మసుమ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

ఆమె వచ్చేసరికి అందరూ స్లీపింగ్ మోడ్ లో ఉన్నారు. అలీ కూడా కళ్లు మూసుకొని ఉండగా.. మసుమ అతడి దగ్గరకి వెళ్లి ఒడిలో అలీ తల పెట్టుకొని ఏడ్చేసింది. బిగ్ బాస్ స్లీపింగ్ మోడ్ నుండి రిలీజ్ చేయడంతో అలీ తన భార్యను దగ్గరకి తీసుకొని ముద్దు పెట్టుకున్నాడు. ఇది బుధవారం ఏపీసోడ్ లోనే హైలైట్ గా నిలిచింది. ఆ తర్వాత భార్యకి బిగ్ బాస్ ఇంటిని మొత్తాన్ని చూపించేశాడు అలీ. ఇక శివజ్యోతి తన భర్త రావడంతో ఏడుపు ఆపుకోలేకపోయింది. మొత్తానికి.. బిగ్ బాస్ ఇంట్లో ఫ్యామిలీ ఎమోషన్స్ బలంగా పండాయ్.