‘తుపాకి రాముడు’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఎప్పుడు.. ఎక్కడ ?


తనకు మాత్రమే సాధ్యమైన హావభావాలతో ‘తీన్ మార్’ వార్తలతో నవ్వించే బిత్తిరి సత్తి హీరోగా ప్రమోషన్ కొట్టేసిన సంగతి తెలిసిందే. ఆయన హీరోగా ‘తుపాకి రాముడు’ సినిమా వస్తోంది. ఈ చిత్రానికి ‘బతుకమ్మ’ ఫేమ్, సీనియర్ దర్శకులు టి. ప్రభాకర్ దర్శకత్వం వహిస్తున్నారు. రసమయి ఫిల్మ్స్ పతాకంపై రసమయి బాలకిషన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ డేటు ఫిక్సయింది.

ఈ ఆదివారం (అక్టోబర్ 20) జెఆర్ సీ కన్వెన్షన్ హాల్ లో తుపాకి రాముడు ప్రీ రిలీజ్ వేడుక జరగనుంది.  ఈ మేరకు చిత్రబృందం అధికారిక ప్రకటన చేసింది. ఈ వేడుకకి సినీ, రాజకీయ ప్రముఖులు ఎవరైనా వస్తారా అన్న విషయాని చిత్రబృందం ఇంకా ఖరారు చేయలేదు. బహుశా.. తెలంగాణ మంత్రులు ఒకరిద్దరు ఈ వేడుకకి వచ్చే అవకాశం ఉంది.