చిరుకి త్రిష సరిపోదా ?
మెగాస్టార్ చిరంజీవి 152 సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇటీవలే సినిమా ప్రారంభోత్సవం కూడా జరుపుకొంది. త్వరలోనే సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో నటీనటుల ఎంపికలో బిజీగా ఉన్నాడు కొరటాల. హీరోయిన్ కూడా ఫిక్స్ చేశాడు. చిరు 152 కోసం నయనతార, అనుష్క, తమన్నా పేర్లు మొదటి నుంచి వినిపిస్తున్నాయ్. ఐతే, వీరిని కాదని త్రిషని తీసుకొన్నారట.గతంలో స్టాలిన్ సినిమాలో చిరుతో జతకట్టింది త్రిష. ఇన్నాళ్లకి మరోసారి మెగాస్టార్ తో కలిసి నటించనుంది.
త్రిష ఎంపికతో మెగా అభిమానులు షాక్ కి గురవుతున్నారు. త్రిష రిటెర్మెంట్ కి దగ్గరగా ఉన్నారు. అలాంటి త్రిషని చిరు కోసం తీసుకోవడంపై ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్నాయి. ఐతే, త్రిష మంచి నటి. కథకి కరెక్ట్ గా సరిపోతుందని ఆమె తీసుకొని ఉంటారని చెప్పుకొంటున్నారు. ఇక కొరటాల మార్క్ సోషల్ మెసేజ్ తోనే చిరు152 ఉండబోతుందని సమాచారమ్. బడా రాజకీయ నేతల బండారం బయపడేలా సినిమా కథ ఉండనుంది. ఇందులో చిరు దేవాదాయ శాఖ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. దేవాలయాల్లో చోరి, దాని వెనక రాజకీయ నేతల హస్తం పాయింట్ ని కొరటాల తనదైన శైలిలో ప్రజెంట్ చేయనున్నారనే ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం చిరు సైరా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఢిల్లీ వెళ్లిన చిరు కేంద్ర పెద్దలని కలుస్తున్నారు. బుధవారం ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుని కలిశారు. ఆయనకి సైరా సినిమాని చూపించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోడీలతోనూ చిరు భేటీ కానున్నట్టు సమాచారమ్