‘విజిల్’ ట్రైలర్ చూశారా ?


అట్లీ-విజయ్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న హ్యాట్రిక్ చిత్రం ‘బిజిల్’. తెలుగులో విజిల్ పేరుతో విడుదల చేయనున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు.ఇందులో విజయ్ ఫుట్ బాల్ కోచ్, మధ్య వయస్కుడిగా రెండు విభిన్న పాత్రల్లో కనిపించారు. ఒక పాత్ర కోచ్ గా అమ్మాయిలకు శిక్షణ ఇస్తుంటే, మరో పాత్ర రౌడీలను ఉతికి ఆరేస్తోంది. ట్రైలర్ లో  యాక్షన్ సన్నివేశాలు హైలైట్ గా నిలిచాయి. నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలోజాకీ ఫ్రాఫ్, వివేక్, యోగిబాబు కీలక పాత్రలు పోషించారు. ఎ.ఆర్ . రెహమాన్ బాణీలు అందించారు. దీపావళి కానుకగా ఈనెల 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.