అశ్వత్థామరెడ్డి అరెస్ట్

ప్రభుత్వం మొండి వైఖరిని వీడి, కార్మికులతో చర్చలు జరపాలని కోరారు తెలంగాణ ఆర్టీసీ ఐకాస కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి. ఆయన్ని పోలీసులు అరెస్టు చేశారు. వామపక్షాలు ఇచ్చిన పిలుపులో భాగంగా ద్విచక్రవాహన ప్రదర్శన చేపట్టిన ఆర్టీసీ కార్మికులు, నేతలని హైదరాబాద్‌ సుందరయ్య విజ్ఞానభవన్‌ వద్ద పోలీసులు అరెస్టు చేశారు. అశ్వత్థామరెడ్డి సహా వామపక్ష నేతలు, మహిళలను అదుపులోకి తీసుకొని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం మొండి వైఖరని వీడి, కార్మికులతో చర్చలు జరపాలని కోరారు. 

అంతకుముందు ఏర్పాటు చేసిన సమావేశంలో సీఐటీయూ అఖిల భారత ఉపాధ్యక్షుడు పద్మనాభన్ మాట్లాడుతూ.. తెలంగాణ ఆర్టీసీ కార్మికుల కోసం కార్మిక లోకమంతా ఉద్యమం చేయడం మంచి పరిణామమని అన్నారు. ‘సెల్ఫ్ డిస్మిస్’ అనే పదం రాజ్యాంగంలో లేదని పద్మనాభన్ గుర్తు చేశారు. ఉద్యమం నుంచి వచ్చిన కేసీఆరే ఆర్టీసీ ఉద్యమాన్ని అణచివేస్తానంటే ఎలా ? అని ఆయన ప్రశ్నించారు.