‘ఖైదీ’ విడుదల అప్పుడే !


టాలీవుడ్ లోనూ మంచి మార్కెట్ ఉన్న కోలీవుడ్ హీరో కార్తీ. ఆయన నటించిన ప్రతి సినిమా తెలుగులోనూ విడుదలవుతుంటుంది. మంచి కలెక్షన్స్ రాబడుతోంది. ఆయన నటించిన యుగానికొక్కడు, ఆవారా, ఊపిరి, ఖాకీ సినిమాలు తెలుగులోనూ హిట్ అయ్యాయ్. కార్తీ తాజా చిత్రం ఖైదీ. ఈ లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వం వహించారు.

యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన చిత్రమిది. ఈ సినిమాలో రెండు ప్రత్యేకతలున్నాయ్. హీరోయిన్ లేదు. పాటలు లేవు. అయినా.. ప్రేక్షకుడిని థ్రిల్ చేసే అంశాలు చాలానే ఉన్నాయని చిత్రబృందం చెబుతోంది. దీపావళీ కానుకగా రాబోతున్న ఖైదీ విడుదల డేటు ఫిక్సయింది. ఈ నెల 25న ఖైదీ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.