రివ్యూ  : ఆపరేషన్ గోల్డ్ ఫిష్

చిత్రం : ఆపరేషన్ గోల్డ్ ఫిష్ (2019)

నటీనటులు : ఆది సాయికుమార్, శ‌షా చెత్రి, రావు ర‌మేశ్‌ తదితరులు

సంగీతం : శ్రీచరణ్ పాకాల

దర్శకత్వం : అడివి సాయికిరణ్

నిర్మాత : వినాయకుడు టాకీస్, యు & ఐ ఎంటర్ టైన్ మెంట్స్

రిలీజ్ డేటు : అక్టోబర్ 18, 2019

రేటింగ్ : 2.5/5

సాయి కిరణ్ అడవి దర్శకత్వంలో ఆది సాయికుమార్ హీరోగా నటించిన చిత్రం ” ఆపరేషన్ గోల్డ్ ఫిష్”. ‘ఎయిర్ టెల్’ మోడ‌ల్ శ‌షా చెత్రి హీరోయీన్ గా నటించింది. ప్రముఖ రచయిత అబ్బూరి రవి ప్రతినాయకుడి పాత్రలో నటించారు.ఓ ఇండియన్ ఆర్మీ ఆఫీసర్, ఘాజీబాబా అనే తీవ్రవాది ఇలా ఇండియా-పాకిస్తాన్ మధ్య నడిచే కథగా తెరకెక్కిన సినిమా ఇది. టీజర్, ట్రైలర్ తో ఆకట్టుకొన్న ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరీ.. ఆఫరేషన్ గోల్డ్ ఫిష్ ఎలా ఉంది ? ప్రేక్షకులని ఏ మేరకు ఆకట్టుకొంది ? తెలుసుకొనేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ.. !

కథ : 

అర్జున్ పండిట్ (ఆది సాయికుమార్) ఆర్మీ ఆఫీసర్‌. అర్జున్ తన తల్లిదండ్రులు కాశ్మీరీ పండితులు కావడంతో వారిని ఉగ్రవాది ఘాజీ బాబా (అబ్బూరి రవి) చంపేస్తాడు. ఐతే, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న ఘాజీ బాబాను అర్జున్ బంధిస్తాడు. అయితే అతన్ని విడిపించడానికి ఫారుఖ్ (మనోజ్ నందం) ఆపరేషన్‌ గోల్డ్‌ఫిష్‌ను ప్రారంభిస్తాడు.ఉగ్రవాది ఫారుఖ్ చేసే ఆ ఆపరేషన్‌లో గోల్డ్ ఫిష్ ఎవరు? గోల్డ్ ఫిష్‌ను కాపాడటానికి అర్జన్ చేసిన ప్రయత్నాలు ఏంటి ? అనేది కథ.

ఎలా ఉందంటే ?

కథని ఆసక్తిని కలిగించేలా మొదలెట్టాడు దర్శకుడు. పక్కా ప్లాన్ తో ఉగ్రవాది ఘాజీబాబాను పట్టుకొన్న ఆర్మీ ఆఫీసర్ అర్జున్ పండిట్.. పై అధికారుల ఒత్తిడితో ఆయన్ని చంపకుండా వదిలేస్తాడు. కోర్టు ఘాజీబాబుకి ఉరిశిక్ష విధిస్తుంది. ఐతే, ఘాజీ బాబాని విడిపించడానికి మరో ఉగ్రవాడి షారుఖ్ ఆపరేషన్ గోల్డ్ ఫిష్ ని ప్రారభిస్తాడు. ఇక్కడి వరకు సినిమా బాగానే సాగింది. ఐతే, ఆ తర్వాత కథని కాలేజ్, ఫ్రెండ్స్, ప్రేమ అంటూ రొటీన్ దారిలోకి తీసుకెళ్లాడు దర్శకుడు. క్లైమాక్స్ మళ్లీ ఏదో ప్రయత్నాలు చేసినా.. అప్పటి సినిమాపై ఆసక్తి తగ్గిపోతుంది. బలమైన కథని రాసుకొన్న సాయికిరణ్ అడవి.. దాన్ని అంతే బలంగా తెరపై చూపించలేకపోయాడు.

ఎవరెలా చేశారంటే ?

అర్జున్ పండిట్ పాత్రలో ఆది సాయికుమార్ కొత్తగా కనిపించాడు. నటనతో ఆకట్టుకొన్నాడు. తానియా పాత్రలో సాషా ఛెత్రి పర్వాలేదనిపించింది. ఫారుఖ్ పాత్రకు మనోజ్ నందం సరిగ్గా సూట్ కాలేదనిపించింది. ఉగ్రవాది పాత్రలో ప్రముఖ రచయిత అబ్బూరి రవి బాగా నటించారు. కార్తీక్ రాజు, నూకరాజు, నిత్యా నరేష్, అనీష్ కురువిల్లా, రావు రమేష్, కృష్ణుడు, రామ జోగయ్య శాస్త్రి తమ తమ పరిధి మేరకు నటించారు.

సాంకేతికంగా :

శ్రీచరణ్ పాకాల అందించిన సంగీతం బాగుంది. నేపథ్య సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. జైపాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది. కశ్మీర్ అందాలని చాలా బాగా చూపించారు. కొన్ని సన్నివేశాలు బోరింగ్ గా అనిపిస్తాయి. వాటికి కత్తెరపెడితే.. బాగుణ్ను. నిర్మాణ విలువలు బాగున్నాయి.

రేటింగ్ : 2.5/5