రివ్యూ : రాజుగారి గది3

చిత్రం : రాజుగారి గది 3

నటీనటులు : అశ్విన్ బాబు, అవికాగోర్, అలీ, ధనరాజ్ తదితరులు

సంగీతం : షబీర్

దర్శకత్వం-నిర్మాత : ఓంకార్

రిలీజ్ డేటు : అక్టోబర్ 18, 2019.

‘రాజుగారి గది’ హారర్ కామెడీ సిరీస్ లో ఇప్పటికే రెండు పార్టులొచ్చాయ్. ఇందులో ‘రాజుగారి గది’ ప్రేక్షకులకి మంచి వినోదాన్ని పంచింది. కమర్షియల్ హిట్ అయింది. ఇక నాగార్జున, సమంత కీలక పాత్రల్లో నటించిన ‘రాజుగారి గది2’ మంచి సినిమా అనిపించుకొంది.కానీ పార్ట్1తో పోలిస్తే పార్ట్2లో వినోదం డోస్ తగ్గింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని రాజుగారి గది సిరీస్’లో మూడో పార్ట్ ని తీసుకొచ్చారు దర్శకుడు ఓంకార్. ఇందులో అశ్విన్-అవికా గోర్ జంటగా నటించారు. పార్ట్ 1, పార్ట్ 2 లని మించిన హారర్, కామేడీ ఉంటుందని ముందు నుంచీ చెప్పారు. మరీ.. ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చిన రాజుగారి గది3లో ఏ మేరకు భయపెట్టింది ? నవ్వించింది ? తెలుసుకొనేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ.. !

కథ :

100యేళ్ల క్రితం ప్రయోగించిన ఓ మంత్ర శక్తి (గరుడ పిళ్లై) అనుకోకుండా మాయ (అవికా గోర్‌) అనే అమ్మాయికి రక్షణగా ఉంటుంది. ఆ అమ్మాయి వెంట ఎవరు పడినా, ఐ లవ్ యు చెప్పినా.. వారిని తీవ్ర ఇబ్బందులకి గురి చేస్తుంటుంది. ఓ ప్రమాదం నుంచి తనను కాపాడిన అశ్విన్‌ (అశ్విన్‌ బాబు) మాయ ఇష్టపడుతుంది. అశ్విన్‌ కూడా మాయను ఇష్టపడతాడు. కానీ తన పరిస్థితి గురించి తెలిసిన మాయ కావాలనే అశ్విన్ ని దూరం పెడుతుంది. కేరళ వెళ్లిపోతుంది. మాయ కోసం కేరళ వెళ్లిన అశ్విన్ కి మాయకు రక్షణగా ఉన్న శక్తి గరుడ పిళ్లై ప్రయోగించినది కాదని తెలుస్తుంది. మరీ.. ఆ శక్తి ఏంటీ ? ఎవరు ప్రయోగించారు ? ఆ శక్తిని ఎదురించి మాయ-అశ్విన్ ఎలా ఒక్కట్టయ్యారు అన్నదే మిగితా కథ.

ప్లస్ పాయింట్స్ :

* విజువల్స్

* ఫస్టాఫ్ వచ్చే హారర్ సీన్

మైనస్ పాయింట్స్ :

* కథ-కథనం

* క్లైమాక్స్

* వినోదం పెద్దగా పండలేదు

ఎలా ఉందంటే ?

భయపెడుతూనే నవ్వించడం హారర్ కామెడీ సినిమాల ప్రత్యేకత. కథ బలంగా ఉంటేనే ఈ రెండు సాధ్యమవుతోంది. ఏమాత్రం కథ వీక్ గా ఉన్న సినిమా తేలిపోతుంది. రాజుగారి గది 3 విషయంలోనూ అదే జరిగింది. వందఏళ్ల క్రితం ప్రయోగించిన ఓ మంత్రం శక్తి అనుకోకుండా మాయ (అవికా గోర్‌) అనే అమ్మాయికి రక్షణగా ఉంటుంది. అందుకు గల కారణాలని బలంగా చూపించలేకపోయాడు ఓంకార్. స్క్రీన్ ప్లే అంత గొప్పగా లేదు. వినోదం పెద్దగా పండలేదు. ఐతే, సినిమాలో కొన్ని చోట్ల మెరుపులున్నాయి. కొన్ని హారర్ సీన్స్ , కొన్ని కామెడీ సీన్స్ ఆకట్టుకొనేలా ఉన్నాయి. మిగితాదంతా రొటీన్ కథ, రొటీన్ టేకింగ్ లా అనిపిస్తోంది. మొత్తంగా రాజుగారి గది మించిన సినిమా పార్ట్ 3 అనిపించుకోలేకపోయింది.

ఎవరెలా చేశారంటే ?

రాజుగారి గదిలో వినోదమే హైలైట్. ఇక రాజుగారి గది 2లో వినోదం డోస్ తగ్గినా.. హారర్ అదిరింది. సమంత పాత్రని అద్భుతంగా డిజైన్ చేశారు ఓంకారు. ఆ పాత్రలో సమంత ఒదిగిపోయి నటించింది. పార్ట్ 1లోని వినోదం, పార్ట్ 2లోని హారర్ డోస్ ని మించేలా పార్ట్ 3ని రెడీ చేసే ప్రయత్నం చేశాడు ఓంకార్. కానీ, కథలో లాజిక్ లు మిస్సయ్యాయి. కథని గ్రిప్పింగా నపడకలేకపోయాడు. ఇక నటనలో అశ్విన్ పర్వాలేదనిపించాడు. ఫస్టాఫ్ లో వచ్చే ఓ హారర్ సీన్ లో అద్భుతంగా నటించాడు. ఇలాంటి పాత్రలో అవికా గోర్ కి కొట్టిన పిండి. ఆమె బాగా నటించింది. బ్రహ్మాజీ, అలీ, ధనరాజ్ తమ వంతుగా నవ్వించే ప్రయత్నాలు చేశారు. మిగితా నటీనటులు ఫర్వాలేదనిపించారు.

సాంకేతికంగా : 

షబీర్ అందించిన పాటలు సాదాసీదాగా ఉన్నాయి. నేపథ్య సంగీతం వీక్ గానే అనిపించింది. సినిమాటోగ్రఫీ మాత్రం బాగుంది. ఎడిటింగ్ ఒకే. నిర్మాణ విలువలు బాగున్నాయి.

చివరగా : రాజుగారి ‘మూడో గదిలోకి వెఌతే నిరాశే’.. !
రేటింగ్ : 2.5/5
నోట్ : ఈ రివ్యూ.. సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే