సంక్రాంతి రేసు నుంచి బాలయ్య అవుట్ !


వచ్చే యేడాది సంక్రాంతి రేసులో నటసింహం నందమూరి బాలకృష్ణ ఉన్న సంగతి తెలిసిందే. ఆయన 102చిత్రం కెయస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ‘రూలర్’ టైటిల్ ని అనుకొంటున్నారు. ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. సంక్రాంతి పోటీ విపరీతంగా ఉంది. స్టార్ హీరోలు అల్లు అర్జున్, మహేష్ బాబు సినిమాలు అల.. వైకుంఠపురంలో, సరిలేరు నీకెవ్వరు ఒకే తేది జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అంతకంటే ముందు సూపర్ స్టార్ రజనీకాంత్ దర్బార్ జనవరి10నే రాబోతుంది.
ఇక జనవరి 15న కల్యాణ్ రామ్ ఎంత మంచివాడవురా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో సంక్రాంతి రేసు నుంచి తప్పుకోవడమే బెటర్ అని బాలయ్య భావిస్తున్నారంట. సేఫ్ జోన్ గా డిసెంబర్ మూడో వారంలో రావడానికి రెడీ అవుతున్నట్టు సమాచారమ్. డిసెంబర్ 20 మంచి డేటు అనుకుంటున్నారట. ఆ రోజు సాయి తేజు ప్రతిరోజు పండగే రిలీజ్ కానుంది. అయినా.. పర్వాలేదు. తేజుతో ఢీకొనడం కష్టమేమీ కాదని బాలయ్య భావిస్తున్నట్టు టాక్. ఇక వెంకీ-చైతూల మల్టీస్టారర్ వెంకీమామ రిలీజ్ డేటు తేలాల్సి ఉంది.