వ్యభిచారం చేస్తున్న సదా.. !

హీరోయిన్ సదా వ్యభిచార వృతిలోకి దిగింది. రాత్రిపూట హైవేల మీద విటుల కోసం వెయిట్ చేస్తుంది. ఆ పని కోసం భారీగానే వసూలు చేస్తుంది. ఐతే, ఇదంతా ఆమె కొత్త సినిమా మేటరు. చాన్నాళ్ల తర్వాత ఆమె నటిస్తున్న చిత్రం ‘టార్చిలైట్’. ఇప్పుడీ టైటిల్ ని ‘శ్రీమతి21ఎఫ్’ గా మార్చారు. ఇందులో సదా వేశ్య పాత్రలో నటించారు.

తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేశారు. ట్రైలర్ ని  బూతులతో నింపేశారు. ‘జాకెట్ విప్పనా.. లేక నువ్వే విప్పితావా’ అంటూ విటుడుని సదా రెచ్చగొట్టడం ట్రైలర్ లో చూడొచ్చు. ‘యే ఏంట్రీ రాగానే పడుకుంటున్నాం.. నాకు మూడు రావొద్దా.. ! అంటే నువ్వు ఇచ్చే రెండొందలకి నిన్ను రెచ్చగొట్టాలంటా.. !’ అంటూ మరో వేశ్య అనడం ట్రైలర్ లో చూడొచ్చు. ఐతే, సదా వేశ్యగా మారడం వెనక ఏదో బలమైన కారణం ఉన్నట్టు ట్రైలర్ లో చూపించారు. అది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.. !