లండన్ లో ‘బాహుబలి’ ఫ్యాన్ మూమెంట్ !


‘బాహుబలి’ టీం మరోసారి కలిసిన సంగతి తెలిసిందే. లండన్ లోని ‘రాయల్ ఆల్బర్ట్ హాల్’ లో ‘బాహుబలి’ స్క్రీనింగ్ కోసం చిత్రబృందం అక్కడి వెళ్లింది. ఐతే, అక్కడ బాహుబలి చిత్రబృందాన్ని చూసేందుకు విదేశాల నుంచి ప్రేక్షకులు రావడం విశేషం. జపాన్ వచ్చిన కొంతమంది అభిమానులు దర్శకధీరుడు రాజమౌళిని కలిశారు. జక్కన్నని కలిసిన ఆనందంలో వాళ్లు ఎగిరిగెత్తాశారు. దానికి సంబంధించిన వీడియోని ‘బాహుబలి’ అఫీషియల్ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇక బాహుబలి, భల్లాలదేవ, శివగామి.. ఇలా బాహుబలి నటీనటులని కలిసిన జపాన్ అభిమానులు ఆనందంగా ఫీలయ్యారు. ఇతర దేశాల నుంచి వచ్చిన వారు సైతం బాహుబలి టీంతో ముచ్చటించేందుకు ఆసక్తిని కనబర్చారు. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది తెలుగు సినిమాకి దక్కిన గౌరవంగా చెప్పవచ్చు.