ప్రభాస్ ప్రేమకథ చాలా గొప్పది !
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రేమకథ చాలా గొప్పగా ఉంటుందట. ‘సాహో’ లాంటి యాక్షన్ థ్రిల్లర్ తర్వాత రాథాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ ఓ ప్రేమకథా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ‘జాన్’ టైటిల్ పరిశీలనలో ఉంది. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ యూరప్‌లో ప్రారంభమైంది. ఈ సినిమా కోసం యూరప్‌లో భారీ సెట్ వేశారు.
ప్రభాస్ ప్రేమకథ గురించి హీరోయిన్ పూజా హెగ్డే ఆసక్తికర విషయాలు చెప్పింది. ‘హౌస్‌ఫుల్-4’ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఆంగ్ల పత్రికకు పూజా ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘ప్రేమకథ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమాలో ప్రభాస్, నేను కలిసి నటిస్తున్నాం. ఇప్పటివరకు నా దగ్గరకు వచ్చిన కథల్లో ఈ కథ చాలా గొప్పది. ప్రభాస్ చాలా సరదాగా ఉంటారు. ‘బాహుబలి’లాంటి ప్రతిష్ఠాత్మక చిత్రంలో నటించాక కూడా ఆయన ఇంత సాధారణంగా ఉండడం చూస్తే నాకు ఆశ్చర్యం కలిగింది. ప్రభాస్ ఫుడ్ లవర్. ఆయన పక్కన ఉండేవాళ్లకి కూడా బాగా ఫుడ్ దొరుకుతుంది” అని చెప్పుకొచ్చింది.