కేసీఆర్ మంత్రివర్గంలో చీలిక.. నిజమేనా ?
ఆర్టీసీ కార్మికుల సమ్మె ఎఫెక్ట్ కేసీఆర్ ప్రభుత్వంపై గట్టిగానే పడింది. సమ్మె ఎఫెక్ట్ తో మంత్రివర్గంలోనూ చీలిక వచ్చిందని కామెంట్ చేశారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. శనివారం రాష్ట్రబంద్ నేపథ్యంలో రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కేసీఆర్ పాలన రాచరికానికి పరాకాష్ఠగా మారిందని రేవంత్ ఆరోపించారు. నిర్బంధాలతో రాష్ట్రాన్ని నడపాలని చూస్తున్నారని మండిపడ్డారు. సమ్మె విషయంలో మంత్రివర్గంలో చీలిక వచ్చిందన్నారు.
కేసీఆర్ పాలనలో రాష్ట్రం సాధించింది కేవలం రూ.2.5 లక్షల కోట్ల అప్పు మాత్రమేనని ఆయన ఎద్దేవా చేశారు.ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని తెరాస ఎన్నికల మేనిఫెస్టోలో లేదు అంటున్న మంత్రులు, ఆర్టీసీని సగం పైవేట్ పరం చేస్తామని మేనిఫెస్టోలో పెట్టారా? అని ప్రశ్నించారు. ఎర్రబస్సుకు 27శాతం ఇంధన టాక్స్ వాసులు చేస్తున్న కేసీఆర్, ఎయిర్ బస్సుకు మాత్రం 1శాతం టాక్స్ మాత్రమే ఎందుకు వసూలు చేస్తున్నారో చెప్పాలని నిలదీశారు. హుజూర్ నగర్ ఉపఎన్నికలో కేసీఆర్ నియంతృత్వాన్ని ఓడించాలని పిలుపునిచ్చారు.