హుజూర్ నగర్ ఫలితంపై.. ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్ ఎంత ?
15రోజుల క్రితం వరకు తెలంగాణలో తెరాసకు ఎదురే లేదు. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లోనూ ఆ పార్టీ ఈజీగా గెలిచేస్తుంది. వార్ వన్ సైడ్ అవుతుంది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలాకలో గులాభి జెండా ఎగరగడం ఖాయం అనుకొన్నారు. ఇంతలో చిన్న ఝులక్. ఆర్టీసీ కార్మికుల సమ్మె కాంగ్రెస్, బీజేపీలో ఓ అస్త్రంగా దొరికింది. సమ్మెపై ప్రభుత్వ వైఖరిని ప్రతిపక్షాలు తమకి అనుకూలంగా మార్చుకోగలిగాయి.
సీఎం కేసీఆర్ ది రాజరిక పాలన. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆర్టీసీ కార్మికులని ఆయన పట్టించుకోవడం లేదనే మాటని ప్రతిపక్షాలు నెత్తినేసుకొన్నాయి. ఈ సమ్మెతో ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగ సంఘాలు, కొన్ని ఉద్యమ సంఘాలని ప్రతిపక్షాలు దగ్గర కాగలిగాయ్. ఆ ఎఫెక్ట్ హుజూర్ నగర్ ఉప ఎన్నికలో ఎంతో కొంత పడనుంది. ఈ నేపథ్యంలో వార్ వన్ సైడ్ అవుతుందనుకొన్న హుజూర్ నగర్ ఉప ఎన్నిక కాస్త త్రిముఖ పోటీగా మారింది. ఇక్కడ తెరాస, కాంగ్రెస్, బీజేపీల మధ్య తీవ్ర పోటీ నెలకొనేలా కనిపిస్తోంది.