కాల్వలో పడిన కారులో ఆరు మృతదేహాలు


శుక్రవారం రాత్రి సూర్యాపేట జిల్లా చాకిరాల వద్ద సాగర్ కాల్వలోకి దూసుకెళ్లిన కారును వెలికితీశారు. వెలికితీసిన కారులో నుంచి ఆరుగురి మృతదేహాలు బయటకు తీయడంతో వారి కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పని చేస్తున్న ఆరుగురు యువకులు తమ స్నేహితుడి వివాహానికి హాజరై తిరుగు పయనమైన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. 

గుంతను తప్పించబోయి అదుపు తప్పిన కారు కాల్వలోకి దూసుకెళ్లింది. వెనకాలే మరోకారులో వస్తున్న స్నేహితులు కారు కొట్టుకు పోవడాన్ని గమనించి స్థానికులకు సమాచారమందించారు. దాదాపు 15 గంటల పాటు శ్రమించిన ఎన్డీఆర్ ఎఫ్ బృందాలు క్రేన్ సాయంతో కారును బయటకు తీశాయి. వరద ఉద్ధృతి ఎక్కువగా ఉండడంతో కారు వెలికితీత పనులు ఆలస్యం అయ్యాయని అధికారులు తెలిపారు.