సప్రైజ్ : ఈ వారం డబుల్ ఎలిమినేషన్

కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ 3 ముగింపు దశకు చేరుకొంది. మరో పదిరోజుల్లో బిగ్ బాస్ 3 సీజన్ ముగియనుంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ 3 విన్నర్ గా ఎవరు నిలుస్తారన్న దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. కొందరు వరుణ్ తేజ్ విన్నర్ గా నిలుస్తాడని చెబుతుంటే.. మరికొందరు శ్రీముఖీకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. మరోవర్గం మాత్రం బాబా భాస్కర్ విన్నర్ గా నిలుస్తారని చెబుతున్నారు. రాహుల్ విన్నర్ అవుతాడు అనేవారు కూడా ఉన్నారు. ఈ విషయం పక్కనపెడితే.. ఈవారం బిగ్ బాస్ ఇంటి నుంచి ఎవరు ఎలిమినేట్ కానున్నారు? 

అంటే.. వితికా, శివజ్యోతి పేర్లు వినిపిస్తున్నాయ్. వీరిలో వితికా బయటికొచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉన్నట్టు సమాచారమ్. ఐతే, బిగ్ బాస్ సప్రైజ్ ప్లాన్ చేసినట్టు సమాచారమ్. ఈ వారం ఒక్కరు కాదు. ఇద్దరు ఎలిమినేషన్ కాబోతున్నట్టు తెలుస్తోంది. నేటి ఏపీసోడ్ కి సంబంధించిన ప్రోమోలోనూ నాగ్ ఈవారం రెండు ఎలిమినెషన్స్ ఉన్నాయా ? అంటూ బిగ్ బాస్ ని అడగడం చూడొచ్చు. నిజంగానే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటే శివజ్యోతికి కష్టమేనని చెప్పవచ్చు.