‘మా’ గొడవపై నరేష్ ఏమన్నారంటే ?

‘మా’ సభ్యుల్లో నెలకొన్న వివాదాలు తారస్థాయికి చేరాయి. ‘మా’ అధ్యక్షుడు నరేష్‌ లేకుండానే జీవిత-రాజశేఖర్‌ జనరల్ మీటింగ్ నిర్వహించడం వివాదాస్పదమైంది. సమావేశం గందరగోళంగా జరగడంతో ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ మధ్యలోనే వెళ్లిపోయారు.

ఈ వివాదంపై మా ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యుడు పృథ్వీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు వ్యక్తులు తాము ప్రెసిడెంట్‌ ఆఫ్ ఇండియాలా ఫీలవుతున్నారని ఆరోపించారు. ప్రతి దానికీ జీవితను తప్పు పట్టడం కొందరికి అలవాటుగా మారిందన్నారు. జరుగుతున్న పరిణామాలు తనని బాధించాయన్నారు.

ఇక ఈ వివాదంపై మా అధ్యక్షుడు నరేష్ స్పందించారు. అధ్యక్షుడు లేకుండా మీటింగ్‌ ఎలా పెడతారని ఆయన ప్రశ్నించారు. “అధ్యక్షుడు లేకుండా ‘మా’ ఎలా సమావేశం అవుతుంది. న్యాయపరంగానూ దీనిపై మా లాయర్‌ను అడిగి తెలుసుకున్నా. తప్పనిసరిగా అధ్యక్షుడు ఉండాల్సిందే”నని చెప్పారని చెప్పారు. ఐతే సమావేశానికి ఆయన్ని ఎందుకు ఆహ్వానించలేదు. అసలు వివాదం ఏంటి ?? అన్నదానిపై నరేష్ వివరణ ఇవ్వలేదు.