అల.. మాస్ సాంగ్ ‘రాములో.. రాములు’

సంక్రాంతి సినిమా ‘అల.. వైకుంఠపురంలో’ దసరా నుంచి ప్రమోషన్స్ కార్యక్రమాలని మొదలెట్టిన సంగతి తెలిసిందే. ‘సామజవరగమన’ పాట వైరల్ అయిపోయింది. సోషల్ నెట్ వర్క్ లో, టిక్ టాక్, హలో లాంటి యాప్స్ లో ఇలా ఎక్కడ చూసినా ఆ పాటే. 40మిలియన్ వ్యూస్, 7లక్షల లైకులని సొంతం చేసుకొంది. అత్యధిక వ్యూస్ సొంతం చేసుకొన్న తొలి తెలుగు పాటగా సామజవరగమన రికార్డ్ సృష్టించింది.

ఇప్పుడు అల.. నుంచి మరో పాటను దీపావళి సందర్భంగా విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించిన టీజర్ ని సోమవారం విడుదల చేయనున్నారు. ‘రాములో..రాములు’ అనే బిట్ తో మొదలయ్యే ఈ సాంగ్ మాస్ ని మురిపించేలా ఉండనుందట. అంతేకాదు.. అల.. రెండో సింగిల్ వచ్చిన వారం, పది రోజుల్లో మూడో సాంగ్ వదలబోతున్నట్టు సమాచారమ్. మొత్తానికి.. రిలీజ్ కి మూడ్నేళ్ల ముందునుంచే అల.. ప్రమోషన్స్ పీక్స్ తీసుకెళ్తున్నారు. సంక్రాంతి సీజన్ లో విపరీతమైన పోటీ ఉన్న నేపథ్యంలో ఈ ప్రమోషన్స్ సినిమాకి ప్లస్ కానున్నాయ్.