అల.. మరో సప్రైజ్ !


త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కుతోన్న హ్యాట్రిక్ చిత్రం ‘అల.. వైకుంఠపురంలో’. ఈ చిత్రంలో యంగ్ హీరోలు నవదీప్, సుశాంత్ లకి కీలక పాత్రలు దక్కాయని తెలిసింది. వీరిలో నవదీప్ లుక్ అప్పుడే రివీల్ అయింది. అల.. ఫస్ట్ సింగిల్ ‘సామజవరగమన’లో బన్నీతో పాటు నవదీప్ కనిపించారు. ఆర్య2లో మాదిరి గెటప్ లో బన్నీకి స్నేహితుడు, కొలిగ్ లాగా కనిపించాడు. సుశాంత్ పాత్రని మాత్రం రిలీవ్ చేయలేదు.

 దీంతో సినిమాలో ఆయన లుక్ ఎలా ఉండబోతుంది ? ఏ పాత్రలో కనిపించబోతున్నారనే ఆసక్తి కలిగింది. తాజాగా సుశాంత్ లుక్ బయటికొచ్చింది. స్వయంగా సుశాంత్ నే తన లుక్ ని రివీల్ చేశారు. చాలా స్టయిలీష్ లుక్ లో కనిపిస్తున్నారు. దాంతో పాటు.. ఈ సాయంత్రం అల.. నుంచి మరో సప్రైజ్ రానుందని ట్విట్ చేశారు. అదేంటీ ? అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. కొద్దిరోజుల క్రితం అల.. తొలి సప్రైజ్ అంటూ సంగీత దర్శకుడు థమన్ బాగానే ఊరించాడు. ఆ సప్రైజ్ ఫస్ట్ సింగిల్ ‘సామజవరగమన’ అంటూ అందించాడు. ‘సామజవరగమన’ సాంగ్ అదిరిపోయింది. అత్యధిక వ్యూస్, లైక్స్ సొంతం చేసుకొన్న తొలి తెలుగు పాటగా రికార్డ్ సృష్టించింది. 

ఈ నేపథ్యంలోనే అల.. నుంచి మరో సప్రైజ్ రాబోతుంది. దీపావళీ కానుకగా అల.. నుంచి రెండో సాంగ్ రాబోతుంది. అది మాస్ సాంగ్ అనే ప్రచారం జరిగింది. తాజాగా దీనిపై సుశాంత్ ట్విట్ చేశారు. బహుశా.. సెకండ్ సాంగ్ రిలీజ్ అప్ డేటుని అందిస్తారేమో.. !