దక్షిణాది నటులని ఎందుకు పిలవలేదు మోడీజీ.. ?


దక్షిణ భారతం అంటే కేంద్రానికి ఎప్పుడూ చిన్న చూపే. ఆ విషయం మరోసారి స్పష్టమైంది. మహాత్మగాంధీ 150వ జన్మదిన వేడుకల్లో భాగంగా శనివారం రాత్రి ప్రధాని మోడీ హిందీ నటీనటులకి ఆథిత్యం ఇచ్చారు. వారితో సరదాగా  గడిపారు. మహాత్మగాంధీ సిద్ధాంతాలని ప్రచారం చేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి అమీర్ ఖాన్, షారుఖాన్, కంగనా, రకుల్ ప్రీత్ సింగ్.. తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా తీసుకొన్న ఫోటోలని ప్రధాని కార్యాలయం, సినీ ప్రములు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అవి వైరల్ అవుతున్నాయి.
ఈ భేటీపై దక్షిణాది సినీ పరిశ్రమ అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది. దక్షిణాది నటీనటులని ప్రధాని ఎందుకు ఆహ్వానించలేదని ప్రశ్నిస్తున్నారు. దీనిపై మెగాస్టార్ చిరంజీవి కోడలు, రామ్ చరణ్ సతీమణి ఉపాసన ప్రధానిపై సంచలన ట్విట్ చేశారు.

ప్రధాని నరేంద్రమోడీపై దక్షిణాది నటీనటులకి చాలా గౌరవం ఉంది. ఐతే, దక్షిణాది సినీ పరిశ్రమని ప్రధాని చిన్న చూపు చూడటం బాధించింది. ఎందుకు దక్షిణాది నటీనటులని మీరు ఆహ్వానించలేదని ఉపాసన సూటిగా ప్రశ్నించింది. భవిష్యత్ లో ఇలాంటివి రిపీట్ కాకుండా చూసుకోవాలని కోరారు. దక్షిణాది భారత్ ప్రధాని మోడీని భాగా సపోర్ట్ చేస్తోంది. మరీ.. ఉపాసన ప్రశ్నపై ప్రధాని కార్యాలయం సమాధానం ఇస్తుందా ? అన్నది చూడాలి.