హైటెక్ వ్యభిచారంలో పలువురు ప్రముఖులు ?

ఇటీవల హైటెక్ సిటీలో హైటెక్ వ్యభిచార ముఠా గుట్టుని రట్టు చేశారు పోలీసులు. మాదాపూర్ లోని ఓ హోటల్ లో పోలీసులు పక్కా సమాచారమ్ తో రైడ్ చేశారు. ఈ రైడింగ్ లో విస్తృతపోయే నిజాలు వెలుగు చూశాయి. విదేశీ వనితలను తీసుకొచ్చి.. అక్కడ వ్యభిచారం చేయిస్తున్నారు. ఈ దాడిలో చాలామంది విదేశీ వనితలు పట్టుబడ్డారు.
 
కొందరు పోలీసులకి చిక్కకుండా తప్పించుకొన్నారు. ఐతే, దొరికిన కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులకి షాకింగ్ విషయాలు తెలిసినట్టు సమాచారమ్. ఈ లిస్టులో పలువురు ప్రముఖులు ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన లిస్టుని రెడీ చేస్తున్న పోలీసులు త్వరలోనే వారిని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసుకొంటున్నట్టు తెలుస్తోంది. ఇందులో యంగ్ హీరోయిన్స్, సినీ, రాజకీయ ప్రముఖుల పిల్లలు ఉన్నట్టు టాక్.