నాలుగు గంటల ‘ఖైదీ’ కథ
కోలీవుడ్ హీరో కార్తీ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఖైదీ’. లోకేష్ కనకరాజ్ దర్శకుడు. ఈ వారమే (అక్టోబర్ 25) ప్రేక్షకుల ముందుకు రానుంది. మెగాస్టార్ చిరంజీవి టైటిల్ తో వస్తోన్న ఈ సినిమా తెలుగు ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంటోంది. ఐతే, చిరంజీవి సినిమా టైటిల్ పెట్టాలనే ఆలోచన మాకు లేదు. కథానుగుణంగానే ఆ పేరును నిర్ణయించామని కార్తీ తెలిపారు. ఇంకా చెప్పాలంటే కార్తీ ‘ఖైదీ’ ఓ ప్రయోగం.
ఇందులో హీరోయిన్ లేదు. పాటలు లేవు. కామెడీ ట్రాక్ లేదు. మాస్ హంగులతో సాగే పూర్తిస్థాయి యాక్షన్ చిత్రమిది. ఒక రాత్రిలో నాలుగు గంటల వ్యవధిలో జరిగే సంఘటనల సమాహారమే ఈ చిత్ర ఇతివృత్తం. ఓ ప్రయాణం కొందరి జీవితాల్ని ఎలాంటి మలుపులు తప్పిందన్నది తెరపై ఆసక్తిగా చూపించబోతున్నారట. యాక్షన్, విజువల్స్ కొత్త అనుభూతిని పంచుతాయి. సినిమా మొత్తం చీకట్లోనే సాగుతుంది. 60 రాత్రుళ్లు చిత్రీకరించారు. ఈ సినిమాపై కార్టీ నమ్మకంతో ఉన్నారు. మరీ.. ఆయన నమ్మకం ఏ మేరకు సక్సెస్ అవుతుందనే చూడాలి. ఈ వారమే (అక్టోబర్ 25) ఖైదీ ప్రేక్షకుల ముందుకు రానుంది.