‘మా’లో అసలు సమస్య అదే !

‘మా’లో మరోసారి విభేదాలు భగ్గుమన్న సంగతి తెలిసిందే. అధ్యక్షుడు నరేశ్ లేకుండానే జనరల్ మీటింగ్ నిర్వహించడానికి ప్రయత్నించారు జీవిత రాజశేఖర్. దాంతో పెద్ద గందరగోళం నెలకొంది. సమావేశానికి వచ్చిన ప్రముఖ రచయిత పరుచూరి గోపాల కృష్ణ, నటుడు 30ఇయర్స్ పృధ్వీ మా లొల్లిపై ఆగ్రహం వ్యక్తం చేసి.. వెళ్లిపోయారు. 

ఇంతకీ మా అసోసియేషన్ లో అసలు సమస్య ఏంటంటే ? ఫండ్ రైజింగ్ అని తెలుస్తోంది. ఫండ్ రైజింగ్ కార్యక్రమం నిర్వహణ విషయంలోనే జీవిత రాజశేఖర్ కు, నరేష్ కు మధ్య విబేధాలు పొడసూపినట్లు తెలుస్తోంది. గతంలో వున్న కార్యవర్గం విషయంలో కూడా ఇదే ఫండ్ రైజింగ్ కార్యక్రమం మీదనే ఆరోపణలు, విమర్శలు వినిపించాయి. గతంలో ఏ సంస్థ అయితే అమెరికాలో కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముందుకు వచ్చిందో.. ఇప్పుడు అదే సంస్థ, అన్నీ క్లియర్ గా ట్రాన్స్ పెరెంట్ గా వుండేలా ఏర్పాట్లు చేసి, సర్టిఫైడ్ ఆడిటింగ్ నిర్వహిస్తూ, రెండు కోట్లు ఇవ్వడానికి నరేష్ ముందుకు వచ్చిందని, దానికి నరేష్ బ్యాకింగ్ చేస్తున్నారని తెలుస్తోంది. అప్పుడు తనని బదనాం చేసిన సంస్థకే ఇప్పుడు నరేష్ పట్టగట్టడంపై శివాజీరాజా వర్గం ఫైర్ అవుతోంది.

ఇదే మా లో నెలకొన్న అసలు సమస్య అని తెలుస్తోంది. ఈ విషయాన్ని దాచిపెట్టి బయటకి వేరే వేరే మాటలు వదులతున్నారని తెలుస్తోంది. మరీ.. మా లో ఎప్పుడు శాంతి నెలకొంటోంది. దాని కోసం సినీ పెద్దలు ఎవరు ముందుకొస్తారు ? సమస్యని పరిష్కరిస్తారన్నది వేచి చూడాలి.