చిరు కోసం సందీప్ కథ ?

‘అర్జున్ రెడ్డి’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొన్నాడు సందీప్ రెడ్డి వంగా. తొలి సినిమాతోనే ట్రెండ్ చేయడంతో ఆయన పేరు టాలీవుడ్ లో మారుమ్రోగిపోయింది. ఇదే సినిమాని బాలీవుడ్ లో రిమేక్ చేసి అక్కడ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. అర్జున్ రెడ్డి రిమేక్ కబీర్ సింగ్ తో బాలీవుడ్ లోనూ సందీప్ పేరు మారుమ్రోగిపోయింది. ఆయన మూడో సినిమాని బాలీవుడ్ లోనే ప్లాన్ చేశాడు. ఇప్పటికే ప్రకటన వచ్చేసింది. రణ్ బీర్ కపూర్ తో సందీప్ హారర్ థ్రిల్లర్ ని తెరకెక్కించబోతున్నట్టు తెలుస్తోంది. 

ఇదిలావుంటే.. మెగాస్టార్ చిరంజీవి కోసం సందీప్ వంగా ఓ కథని రెడీ చేసుకొన్నారంట. త్వరలోనే చిరుని కలిసి కథని వినిపించబోతున్నట్టు తెలుస్తోంది. చిరు ఓకే చెబితే ప్యాన్ ఇండియా సినిమాగా తెలుగు, హిందీ, తమిళ బాషల్లో ఆ సినిమా తీయడానికి ప్లాన్ చేసుకొన్నట్టు సమాచారమ్. అర్జున్ రెడ్డి తర్వాత సందీప్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ సినిమా చేస్తారనే ప్రచారం జరిగింది. కానీ జరగలేదు. ఇప్పుడు చిరుతో సందీప్ సినిమా అనే ప్రచారం మొదలైంది. మరీ.. ఈ సినిమానైనా పట్టాలెక్కుతుందో చూడాలి.