‘వెంకీమామ’ అసలు సమస్య అదా.. ?


బాబీ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, ఆయన మేనల్లుడు నాగ చైతన్య నటిస్తున్న చిత్రం ‘వెంకీమామ’. సంక్రాంతి సినిమాగా ముద్రవేయించుకొంది. కానీ, రిలీజ్ డేటుని మాత్రం ఇప్పటి వరకు ఫిక్స్ చేసుకోలేదు. ఆ మధ్య వెంకీమామకి బంపర్ ఆఫర్ ఒకటి వచ్చినట్టు ప్రచారం జరిగింది. అదే డిసెంబర్ 20న సోలో రిలీజ్ కి ఆఫర్ చేశారట. కానీ ఆ ఆఫర్ ని వెంకీమామ స్వీకరించలేదు.

ఇప్పుడు డిసెంబర్ 20 డేటు ఫుల్ అయింది. సాయితేజు ప్రతిరోజు పండగే డిసెంబర్ 20న రిలీజ్ డేటుని ప్రకటించుకొంది. బాలయ్య 152 ‘రూలర్’ కూడా అదే డేటుకి రాబోతున్నట్టు సమాచారమ్. ఇంతమంచి డేటుని వెంకీమామ మిస్ చేసుకోవడం వెనక బలమైన కారణం ఒకటి ఉందట. అదే.. ఈ సినిమా గ్రాఫిక్ వర్క్ అలానే మిగిలిఉందట. అది ఎప్పటికి పూర్తవుతుందనేది తెలియని విషయం. రీసెంట్గా కొన్ని గ్రాఫిక్స్ వర్క్ చూసిన సురేష్ బాబు అవి నచ్చకపోవడంతో మళ్లీ చేయమని చెప్పినట్లు సమాచారమ్. ఈ నేపథ్యంలో వెంకీమామ రిలీజ్ డేటుని ప్రకటించలేకపోతున్నట్టు తెలుస్తోంది. చూస్తుంటే వెంకీమామ డిసెంబర్, సంక్రాంతికి కూడా వచ్చేలా లేదు. బహుశా.. తాపిగా ఫిబ్రవరిలో వస్తాడేమో.. !