దంపతులని విడదీసిన బిగ్ బాస్ !


బిగ్ బాస్ దంపతులని విడదీశాడు. అలాగని పాపం చేశాడని అనుకోవద్దు. ఇది గేమ్ లో భాగంగా చేసిన పని. బిగ్‌బాస్:సీజన్‌3’లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన జంట వరుణ్‌ సందేశ్‌-వితిక. నిజ జీవితంలో భార్యాభర్తలు అయిన వీరిద్దరూ షోకు రావడం ఆసక్తికర విషయం. ఐతే, ఈ వారం బిగ్ బాస్ ఇంటి నుంచి వితిక ఎలిమినేట్‌ అయ్యారు. ఈ వారం నామినేషన్‌లో ఉన్నవారిలో వితికకు ప్రేక్షకుల నుంచి అతి తక్కువ ఓట్లు రావడంతో ఆమె ఎలిమినేట్ అయినట్టు హోస్ట్ నాగార్జున ప్రకటించారు.

ఈ వారంటో బిగ్ బాస్ విజయవంతంగా 13వారాలని పూర్తి చేసుకొంది. ఐతే, ప్రతివారం ఎవరు ఎలిమినేత్ అవుతున్నారనే విషయం రెండ్రోజుల ముందే లీకవుతుండటం షోపై ఆసక్తి తగ్గుతోంది. ఈ వారం వితిక ఎలిమినేట్ అవుతుందనే ఓ నాలుగైదు రోజుల ముందు నుంచే ప్రచారం జరుగుతోంది. ఇక ఈ వారం డబుల్ ఎలిమినేషన్ చేసి ప్రేక్షకులకి సప్రైజ్ ఇస్తారనుకొన్న బాగ్ బాస్.. సదాసీదాగానే ముగించాడు. మిగిలిన ఆరుగురు సభ్యుల్లో టైటిల్ విన్నర్ గా  పోరులో నిలిచే సభ్యులుగా  శ్రీముఖీ, రాహుల్, బాబా భాస్కర్ పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి.