మూడో టెస్ట్ : ఒక్క పరుగుకే సఫారీలు ఆలౌట్

ఒక్క పరుగుకే ఆలౌట్ అవ్వడమేంటీ ? అనుకొంటున్నారా ? రాంచీ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో మూడో రోజు టీమిండియా విజయం ముంగిట నిలిచిన సంగతి తెలిసిందే. మూడోరోజు ముగిసే సరికి దక్షిణాఫ్రికా 132/8గా నిలిచింది. మరో రెండు వికెట్లు పడగొడితే.. భారత్ దే విజయం. ఐతే, నాల్గోరోజు దానికి ఎక్కువ సమయం పట్టలేదు. కేవలం ఒక్క పరుగు చేసిన దక్షిణాఫ్రికా మిగిలిన రెండు వికెట్లు కోల్పోయింది. దాంతో మూడో టెస్టులో టీమిండియా 202 పరుగుల తేడాతోడో ఇన్నింగ్స్ మిగిలి ఉండగానే విజయం సాధించింది.

ఈ మ్యాచ్ లో భారత్ జట్టు ఓపెనర్ రోహిత్ శర్మ డబుల్ సెంచరీ చేయగా, అజింక్య రహానే సెంచరీ చేశాడు. రవీంద్ర జడేజా హాఫ్ సెంచరీ చేశాడు. దాంతో భారత్ జట్టు తొలి ఇన్నింగ్స్ లోనే 9వికెట్ల నష్టానికి 497 పరుగుల వద్ద డిక్లేర్డ్ చేసింది. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన సౌతాఫ్రికా జట్టు మొదటి ఇన్నింగ్స్ 162 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఫాలో ఆన్ తప్పిని దక్ల్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్ లోనూ ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయారు. 133 పరుగులకే చేతులెత్తేశారు. దాంతో.. ఇన్నింగ్స్ 202 పరుగులతో తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. మూడు టెస్టుల సిరీస్ ని కోహ్లీ సేన క్లీన్ స్వీప్ చేసింది.