ఈపీఎఫ్‌వో పింఛన్ వయసు 60కి పెంపు
ఈపీఎఫ్‌వో (ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ) పింఛన్ పొందడానికి వయోపరిమితిని 58 ఏళ్ల నుంచి 60కి పెంచాలని యోచిస్తోంది.ఈ మేరకు నవంబరులో జరిగే కేంద్ర ధర్మకర్తల మండలి (సీబీటీ) సమావేశంలో ప్రతిపాదన పెట్టనుంది. పింఛన్ వయోపరిమితి పెంచడం ద్వారా అదనపు బోనస్ ఇవ్వాలని కూడా ప్రతిపాదిస్తోంది. పింఛన్‌ను లబ్ధిదారులు పెంచుకునేందుకు వీలుగా 60 ఏళ్లు వచ్చాక పింఛన్ తీసుకునేవారికి కొంత అదనపు బోనస్ ఇవ్వాలని ప్రతిపాదిస్తోంది. మరీ.. ఈ ప్రతిపాదన వాస్తవరూపం దాల్చుతుందా ? అనేది నవంబర్ లో తేలనుంది.