అజ్ఝాతం వీడిన కల్కీ భగవాన్ !
ఎట్టకేలకు ఆధ్యాత్మిక గురువు కల్కిభగవాన్ అజ్ఝాతం వీడారు. ఇటీవల కల్కి భగవాన్‌కు చెందిన ఆశ్రమాల్లో ఆదాయ పన్నుశాఖ అధికారులు పెద్ద ఎత్తున సోదాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణలోని కల్కి భగవాన్, ఆయన కుమారుడు కృష్ణకు చెందిన 40 ఆశ్రమాల్లో అధికారులు ఈ సోదాలు నిర్వహించారు.
ఈ తనిఖీల్లో రూ.500కోట్లకు పైగా లెక్కల్లో చూపని సంపద బయట పడింది. కోట్లు విలువ చేసే బంగారు, వజ్రాభరణాలను గుర్తించారు. ఐతే, ఈ సోదాల తర్వాత కల్కి భగవాన్ అజ్ఝాతం లోకి వెళ్లిపోయారు. దీంతో ఆయన విదేశాలకు వెళ్లిపోయారంటూ ప్రచారం జరిగింది. తాజాగా, ఈ ప్రచారంపై కల్కీ భగవాన్ స్పందించారు. ఈ మేరకు ఓ వీడియో సందేశాని విడుదల చేశారు.
“నేను చాలా ఆరోగ్యంగా ఉన్నా. విదేశాలకు పారిపోయానని వస్తున్న వార్తల్లో నిజం లేదు. నేను ఎక్కడికీ వెళ్లలేదు. చెన్నై ‘నేమం’లోనే ఉంటున్నా. ఎప్పటిలాగే ఆశ్రమంలో బోధనా కార్యక్రమాలు జరుగుతాయి. మమ్మల్ని నమ్ముకున్న వాళ్లకు ఎప్పటికీ అండగా ఉంటాం” అని కల్కి భగవాన్ ఆ వీడియోలో తెలిపారు.
Message from self-styled godman ‘Kalki Bhagwan.’ He says – ‘We have not fled the Country, we are in Nemam (TamilNadu.). IT Dept has not said we have fled the country. We are here, we will continue to help our friends, we are their strength.’ #wellness #KalkiBhagwan #KalkiAshram pic.twitter.com/FHbI5uLDaG
— Rishika Sadam (@RishikaSadam) October 22, 2019