కొమరం భీమ్ బర్త్ డే : లుక్ లేదు.. ట్విట్ మాత్రమే !
నేడు (అక్టోబర్ 22) కొమరం భీమ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో నుంచి కొమరం భీమ్ గా ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేస్తారని అందరు భావించారు. కానీ, దర్శకధీరుడు రాజమౌళి నిరాశపరిచాడు. ఎలాంటి లుక్ వదలకుండా.. కేవలం ట్విట్ మాత్రమే చేశారు. ‘స్వాతంత్య్రం కోసం పోరాటం చేసిన ధీరుడు కొమరం భీమ్ జయంతి సందర్భంగా.. ఆర్.ఆర్.ఆర్ సినిమాకు సంబంధించిన ఒక విషయాన్ని మీతో పంచుకుంటున్నందుకు ఎంతో సంతోషిస్తున్నాం. ఈ సినిమాలో ఎన్టీఆర్ యంగ్ భీమ్‌గా కనిపించనున్నారు’ అని ఆర్ఆర్ఆర్ చిత్రబృందం ట్విట్ చేసింది.
స్వాత్రంత్య్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ ల కథతో ఆర్ఆర్ఆర్ తెరకెక్కుతోంది. వీరిద్దరి మధ్య ఉన్న కామన్ పాయింట్ ఆధారంగా రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ కథని రెడీ చేశారు. ఈ సినిమా కోసం రామ్‌చరణ్, ఎన్టీఆర్ తొలిసారి కలిసి నటిస్తున్నారు. రామ్‌చరణ్‌కు జంటగా బాలీవుడ్ నటి ఆలియా భట్ నటించనున్నారు. ఎన్టీఆర్‌కు జోడిగా మొదట హాలీవుడ్ సుందరి డైసీ ఎడ్గర్ జోన్స్ అనుకున్నప్పటికీ ఆమె కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా నుంచి తప్పుకొన్నారు. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ ఈ సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నారు. వచ్చే ఏడాది జూలై 30న ఆర్ ఆర్ ఆర్ ప్రేక్షకుల ముందుకు రానుంది.
Remembering the bravery and grit of revolutionary freedom fighter Sri Komaram Bheem garu on his birth anniversary!
We are excited to show you our @tarak9999 on the screen as young Bheem in #RRR! 🌊— RRR Movie (@RRRMovie) October 22, 2019