ధోని.. సన్నీ కంటే డేంజర్ !
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని శృంగార తార సన్నీలియోన్ కంటే డేంజర్ అని తేలింది. ధోని కోసం సెర్చ్ చేస్తే బూతు సైట్లకి తీసుకెళ్తుందట. ఇంటర్నెట్‌లో ఏదైనా సమాచారం కోసం వెతుకుతున్నప్పుడు నకిలీ లింకులు తగలడం సర్వసాధారణం. వాటిని ఓపెన్ చేస్తే అవి అశ్లీల, ప్రమాదకర వెబ్‌సైట్లకు దారితీస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే ఎంఎస్ ధోనీ ఇంటర్నెట్లో అత్యంత ప్రమాదకర వ్యక్తిగా మారిపోయాడు. ధోని పేరుతో సమాచారం వెతుకుతున్నప్పుడు అత్యంత ఎక్కువగా మాలీసియస్ వెబ్‌సైట్లకు లింకులు రీడైరెక్ట్ అవుతున్నాయని మెకాఫీ సంస్థ వెల్లడించింది.
ఇలాంటి సెలెబ్రిటీల జాబితాలో బోల్డ్ నటి రాధికాఆప్టె, శ్రద్ధాకపూర్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, మాజీ క్రికెటర్ సచిన్ తదితరులు
ఉన్నారు. ఐతే, ఈ జాబితాలో సచిన్, ధోని అగ్రస్థానంలో ఉన్నారు. సన్నీలియోన్ నాలుగో స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో సన్నీలియోన్ కంటే ధోని డేంజర్ అని చెప్పుకొంటున్నారు. అందరికీ ప్రమాదకర వెబ్‌సైట్లపై అవగాహన ఎక్కువగా ఉండదు. అందుకే మాలీసియస్ వెబ్‌సైట్లు ఇలాంటి సమాచారాన్ని ఎరగా వేస్తున్నాయని మెకాఫీ ఇండియా ఎండీ వెంకట్ కృష్ణాపుర్ తెలిపారు.