నాగ్ కొత్త నిర్ణయం

సీనియర్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ దూసుకెళ్తున్నారు. వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకొంటున్నారు. యంగ్ హీరోలకి గట్టిపోటీనిస్తున్నారు. ఐతే, సీనియర్ హీరోల్లో కింగ్ నాగార్జున కాస్త వెనకబడినట్టు కనిపిస్తోంది. నాగ్ నటించిన ఆఫీసర్, దేవదాస్, రాజుగారిగది2, మన్మథుడు2 పెద్దగా ఆడలేదు. ఇక మన్మథుడు2 తర్వాత మరో సినిమాని నాగ్ మొదలెట్టలేదు. ఈ నేపథ్యంలో నాగ్ కొత్త సినిమాపై రకరకాల ప్రచారం జరుగుతోంది.

‘బంగార్రాజు’ సినిమా ఎప్పుడో ప్రారంభించాల్సి ఉంది. ఎప్పటికప్పుడూ వాయిదా పడుతోంది. సోగ్గాడే చిన్ని నాయన సినిమాలోని బంగార్రాజు పాత్రని స్పూర్తిగా తీసుకొని దర్శకుడు కల్యాణ్ కృష్ణ కథని రెడీ చేసుకొన్నారు. నాగ్ ఎప్పుడంటే ? అప్పుడే షూటింగ్. ఇంతలో బాలీవుడ్ హిట్ ‘రైడ్’ సినిమా రిమేక్ లో నాగ్ నటించబోతున్నట్టు ప్రచారం మొదలైంది. ప్రస్తుతం నాగ్ బిగ్ బాస్ 3తో బిజీగా ఉన్నారు. మరో 8 రోజుల్లో బిగ్ బాస్ 3 ముగియనుంది. ఆ తర్వాతే నాగ్ కొత్త సినిమాపై నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. నవంబర్ నాగ్ కొత్త సినిమా ప్రారంభం కానుంది. అది బంగార్రాజు సినిమానే కానున్నట్టు సమాచారమ్.