‘జార్జ్ రెడ్డి’ దర్శకుడికి పవన్ ఆఫర్ !


‘జార్జ్ రెడ్డి’ దర్శకుడు జీవన్ రెడ్డి పంట పడింది. ఆయనకి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నుంచి పిలుపొచినట్టు సమాచారమ్. పవన్ తో సినిమా చేసేందుకు చాలామంది దర్శకులు ప్రయత్నిస్తున్నారు. ఈ లిస్టులో స్టార్ దర్శకుల నుంచి యువ దర్శకులు ఉన్నారు. వారందిరినీ కాదని జీవన్ రెడ్డికి పవన్ నుంచి పిలుపు రావడం విశేషం. 

‘దళం’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు జీవన్ రెడ్డి. ఆయన దర్శకత్వం వహిస్తున్న రెండో సినిమా ‘జార్జ్ రెడ్డి’. జార్జ్ రెడ్డి విద్యార్థి నాయకుడు. హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్శిటీలో చదువుతూ.. విద్యార్థి ఉద్యమాల్లో తిరుగులేని నాయకుడుగా ఎదిగిన జార్జి రెడ్డిని చాలా చిన్న వయసులోనే కొందరు ప్రత్యర్థులు క్యాంపస్ లోనే హత్య చేశారు. ఆయన జీవిత కథతో తెరకెక్కిన చిత్రమే జార్జ్ రెడ్డి. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ విమర్శకుల ప్రశంసలు అందుకొంది. 

ఇండస్ట్రీ పెద్దలు జార్జ్ రెడ్డి ట్రైలర్ బాగుందంటూ కితాబిచ్చారు. పవన్ ని కూడా జార్జ్ రెడ్డి ట్రైలర్ ఆకట్టుకొంది. దీంతో దర్శకుడు జీవన్ రెడ్డికి కబురు పెట్టారు. వచ్చి తనని కలవమని ఫోన్ చేయించారు. ఇప్పుడీ ఆనందంలో జీవన్ రెడ్డి ఉన్నారు. బహుశా.. తన భావాలకి దగ్గరగా ఆలోచనలు ఉన్న దర్శకుడు జీవన్ రెడ్డికి పవన్ సినిమా ఆఫర్ ఇస్తాడేమో చూడాలి.