‘రాములో.. రాముల’ వచ్చేసింది !

నిన్న వాయిదా పడిన ‘రాములో.. రాముల’ సాంగ్ టీజర్ వచ్చేసింది. త్రివిక్రమ్-అల్లు అర్జున్ కలయికలో తెరకెక్కుతోన్న హ్యాట్రిక్ చిత్రం ‘అల.. వైకుంఠప్పురంలో’. ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ ‘సామజవరగమన’ సూపర్ హిట్ అయింది. అత్యధిక వ్యూస్ (40మిలియన్ వ్యూస్, 7లక్షల లైక్స్) సొంతం చేసుకొన్న తొలి తెలుగు పాటగా రికార్డ్ సృష్టించింది.

ఇక అల.. నుంచి దీపావళీ కానుకగా మాస్ సాంగ్ ‘రాములో.. రాముల’ సాంగ్ ని విడుదల చేయనున్నారు. ఈ సాంగ్ టీజర్ ని సోమవారం రిలీజ్ చేస్తారని ప్రకటించారు. అది కాస్త ఇవాళ్టీకి వాయిదా పడిన సంగతి తెలిసిందే. కొద్దిసేపటిక్రితమే రాములో.. రాముల సాంగ్ టీజర్ వచ్చేసింది. ‘రాములో రాముల నన్ను ఆగం జేసిందిరో.. రాములో రాముల నా పాణం తీసిందిరో.. ‘ అంటూ సాగే సాంగ్ టీజర్ అదిరిపోయింది. పబ్ లో బన్నీ, పూజా హెగ్డే లపై చిత్రీకరించిన సాంగ్ అదిరిపోయింది. ఈ పాటని కాసర్ల శ్యామ్ రాసిన ఈ పాటని అనురాగ్ కులకర్ణి, మంగిలి కలిసి పాడారు. థమన్ సంగీతం అందించారు. ఫుల్ సాంగ్ ఈ నెల 26న రిలీజ్ చేయనున్నారు.