విడాకులకి రెడీ అయిన స్టార్ హీరో కూతురు ?

టాలీవుడ్ లో స్టార్ హీరో కూతురు విడాకులు తీసుకొనేందుకు రెడీ అయినట్టు సమాచారమ్. ఇన్నాళ్లు బాలీవుడ్ లోనే సినీ ప్రముఖుల పిల్లల పెళ్లిళ్లు.. కొద్దిరోజులకే బ్రేకప్ లు ఉండేవి. ఇప్పుడవి టాలీవుడ్ కి పాకినట్టు కనిపిస్తోంది. టాలీవుడ్ లో పెద్ద హీరో కుమార్తె ఒకరు విడాకుల దిశగా పయనిస్తున్నట్లుగా పక్కా న్యూస్ లీక్ అయ్యింది.

ఆమెకు కొన్నేళ్ల క్రితమే ఓ బిజినెస్‌మేన్‌తో పెళ్లి జరిగింది. అయితే భర్తతో ఆమెకు మనస్పర్థలు రావడంతో ఆమె కొన్నేళ్లుగా తండ్రి వద్దే ఉంటూ వాళ్లకు సాయం చేస్తూ వస్తోంది. భర్తతో ఆమె కలిసి ఉండటం కష్టమని డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు.. కూతురు నిర్ణయానికి తండ్రి కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఇంతకీ ఆ స్టార్ ఎవరు  ? అన్న విషయాన్ని మాత్రం తెలిసినా.. ఎవరు బయటికి చెప్పడం లేదు.